ఈనెల 19న ఉద్యోగ మేళా

నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 19న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో
ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి ఉద్యోగమేళాలో వరుణ్ మోటార్స్, సచిన్దర్
ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, మెడ్ ప్లస్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.
వరుణ్ మోటార్స్ కంపెనీలో 360 ఖాళీలు ఉన్నాయని, అసోసియేట్, ఎలక్ట్రిషన్, క్వాలిటీ అసోసియేట్, ల్యాబ్ అసోసియేట్, ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు గలవని తెలిపారు.  పదవ తరగతి పాస్,ఇంటర్ మరియు ఐటిఐ/బీటెక్/డిప్లమో విద్యార్హతలు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. కనీస వేతనం 12 వేల నుండి 15 వేల రూపాయలు, ఇన్సెంటివ్స్ లభిస్తాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సచిందర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో 100 ప్రొడక్షన్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, పదవ తరగతి  ఉత్తీర్ణత, ఇంటర్ మరియు ఐటిఐ/డిప్లమా విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు. వేతనం 10 వేల నుండి 12 వేలు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు గగ్గిలా పూర్ లో పనిచేయాల్సివుంటుందని తెలిపారు.
మెడ్ ప్లస్ కంపెనీలో 150 ఫార్మసిస్ట్/సి ఎస్ ఏ/జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయని, వీటికి పదవ తరగతి పాస్/ఇంటర్/డిగ్రీ/డి. ఫార్మసి/బి ఫార్మసీ/ఎం ఫార్మసీ విద్యార్హతలు ఉండాలన్నారు. వేతనం 10,500 నుండి 12 వేలు, ఇన్సెంటివ్స్, ఉచిత వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాదులో పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.
ఇట్టి ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 24 సంవత్సరాలని పేర్కొన్నారు.
  ఈ నెల 19 న(శనివారం) ఉదయం 10 గంటలకు సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల పాత డిఆర్డిఏ కార్యాలయంలో  ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
 ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు
 తమ విద్యార్హతల ధృవ పత్రాలు, అనుభవ ధ్రువీకరణ, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జిరాక్స్ ప్రతులతో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నేరుగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ఆయన కోరారు.