ఈనెల 24 న ఆఫీసర్స్ క్లబ్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ సౌజన్యంతో ఈనెల 24న ఆదివారం రోజున నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ పక్కన గల ఆఫీసర్స్ క్లబ్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు( ఐజెయు) జిల్లా అధ్యక్షులు అంగిరేకుల అంగిరేకుల సాయిలు తెలిపారు . నగరంలోని ఆఫీసర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా,లండన్ దేశాలలో శిక్షణ పొంది దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ఆపరేషన్ లు చేసిన హైదరాబాద్ లోని ఎ.వి.ఎస్. హాస్పిటల్ కు చెందిన డాక్టర్ రాజా, డా.వి.కొప్పాల, డా.కార్తిక్, డా.గణేష్ లతో కూడిన పలువురు డాక్టర్ల బృందం ఈ మెగా క్యాంపు లో పాల్గొంటారని అన్నారు. కాళ్ళల్లో నరాలు వాచి నిలబడలేక పోవడం, దురద, నల్లటి మచ్చలు, పుండ్లు, కాళ్ళ రంగు మారడం వంటి లక్షణాలు కలిగిన వారికి వ్యాధి నిర్ధారణ, మోకాళ్ళ నొప్పులు, నఫుమునొప్పి, వెన్నుపూస తదితర వాటికి గాను సలహాలు, సూచనలు, మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. కావున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు , ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆఫీసర్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, తెలంగాణ యూనియన్ వర్కింగ్ ఆఫ్ జర్నలిస్టు (ఐజెయు) నాయకులు ప్రసాద్, లింబాద్రి ,మోహన్ తదితరులు పాల్గొన్నారు.