ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్న సీబీటీ సిఫారసులకు అనుగుణంగా ఈపీఎఫ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 8.8 శాతంగా నిర్ణయించింది. ఇటీవల ఇపిఎఫ్ఓ ధర్మకర్తల త్రైపాక్షిక సెంట్రల్ బోర్డు (సిబిటి) ఏకగ్రీవ నిర్ణయానికి విరుద్ధంగా ప్రకటించిన 8.7 శాతం వడ్డీ రేటు నిర్ణయానికి వెనక్కి తీసుకుంది.
కాగా ఆర్థిక శాఖ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ సహా పది కేంద్ర కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ 29న పెద్ద ఎత్తున నిరసనకు దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.