ఈబీ5 వీసాలపై ట్రంప్ టార్గెట్
ఈబీ5 వీసాలు రద్దు చేసే ఆలోచనలో అమెరికా
వాషింగ్టన్, జూన్23(జనం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఈబీా5 పెట్టుబడిదారుల వీసా ప్రోగ్రాంపై దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ హెచ్‌ా1బీ వీసా విధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈబీా5 వీసాలపై టార్గెట్ చేశారు. ఈబీా5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్ యంత్రాంగం యూఎస్ కాంగ్రెస్‌ను కోరింది. ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వినియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్సానా పేర్కొన్నారు. ఈబీా5 వీసా ప్రోగ్రాంకు ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీకి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ సమావేశంలో ఈ మేరకు శాసనకర్తలను కోరారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీా5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. విదేశీయులు మనీలాండరింగ్‌కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈబీా5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీయులకు పెట్టుబడిదారుల వీసాలు ఇస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీా5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది. గత ఏడాది భారత్ నుంచి ఈబీా5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా.