ఈయూ, టీఎంయూ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె నివారణ కోసం సంస్థ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. గుర్తింపు సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ నేతలతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు చేపట్టారు. ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని, ఉద్యోగులందరికీ వేతన సవరణ చేయాలని ఈయూ, టిఎంయూ ప్రతినిధులు మే 27న ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు.