ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం
వచ్చే సంవత్సరం ప్రత్యామ్నాయం చూసుకొండి:హైకోర్టు
హైదరాబాద్,సెప్టెంబర్3(జనంసాక్షి):
వినాయక నిమజ్జనాలపై సస్పెన్స్‌కు తెరపడింది.ఈ యేడాదికి హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేసుకోవచ్చిని హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై విచారణ జరిగింది. ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్ కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాదికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ లో ఈసారికి వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.విగ్రహ నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేపట్టవచ్చని సూచించింది. ఆ వెంటనే వ్యర్ధ పదార్దాలను తొలగించాలని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి మాత్రం బెంగుళూరు, పూణె తరహాలో మరో లేక్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకోవాలని హైకోర్టు అబిప్రాయపడింది. దీనిపై తదుపరి విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. వచ్చే ఏడాదిలోగా నిమజ్జనానికి ప్రత్యామ్నయాలను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సేన్ సాగర్‌లో గణెళిష్ నిమజ్జనం వల్ల నీరంతా కలుషితమవుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు ఈ కేసును విచారించింది.