ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి.
ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్..
తిరుమలాయపాలెం మండలం ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్*
హాజరైన వివిధ అధికారులు*
ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి (13 సెప్టెంబర్) తిరుమలాయపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ
స్థానిక శాసనసభ్యులు గౌరశ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఈనెల 16, తేదీలలో నిర్వహించే తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.సీఎం కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరగాలి.పకడ్బందీ ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి.అందరూ భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించండి .అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలి….. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ జయరాం నాయక్, ఎంపీవో రాజేశ్వరి, ఏపీఓ నర్సింహారావు,ఎఓ సితారాం రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు,వివిధ అధికారులు* పాల్గొన్నారు..