ఈ నెల 19న తెలంగాణకోసం సీపీఐ ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఈ నెల 19న ఇందిరాపార్కు వద్ద సీపీఐ సామూహిక ధర్నా చేపట్టనున్నట్టు రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ధర్నాకు సంబంధించి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను ధర్నాకు  పిలవనున్నట్లు తెలిపారు. మతతత్వపార్టీ బీజేపీ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్సార్సీపీలను పిలవడం లేదని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ నిర్ణయం అనుకూలంగా రాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తాజావార్తలు