ఈ నెల 25 నుంచి మే 15 లోపు బదలీల పూర్తీ….జీఓ నెం.100 విడుదల చేసిన ప్రభుత్వం.
ఖమ్మం కలెక్టరేట్, (జనంసాక్షి): వివిధ శాఖల్లో సని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం జీఓ నంబర్ 100 విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 15 లోపు బదిలీలను పూర్తి చేయాలని జీఓలో పేర్కోంది. ఐదు సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించిన ఉద్యోగులను తప్పని సరిగా బదిలీ చేయనున్నారు. దీంతో జిల్లాలో 10 నుంచి 15 మంది వరకు ఎంపీడీఓలు, జిల్లా పరిషత్‌కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సుమారు 50 మంది ఉద్యోగులు బదిలీ కానున్నారు. వాద్యాశాఖలో బదిలీలకు సంబంధించి నేడు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే వివిధ మండల్లాల్లొ సనిచేస్తున్న ఉపిద్యాయులు తమకు ఉన్న రాజకీయ పలుకుఎబడితో ప్రత్యేక జీఓలు తెచ్చుకుని బదిలీ చేయించెకున్నారు. సోమవారం అనేక మంంది ఉపాద్యాయులు రీలీఫ్ ఆయినట్లు తెలిసింది. విద్యాశాఖలో బదిలీల ప్రక్రీయ తక్కువగా ఉండే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలనుంచి బదిలీలకు సంబంధించి షెడ్యూల్ రావాల్సింది. మొత్తం 100 శాతంలో 20 శాతం మాత్రమే బదిలీలు చేయాల్సింది. తొలుత జిల్లా స్థాయిలో బదిలీల క్రక్రియ ముగిసిన తర్వాత రీజియన్, స్టేట్ లెవల్ బదిలీలు జరగనున్నాయి. బదిలీల నేపథ్యంలో పలువురు ఉద్యోగులు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న నేతలను ఆశ్రయిస్తున్నారు.