ఈ నెల 28 చలో కరీంనగర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర హమాలి సంఘం చలో కరీంనగర్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర హమాలి సంఘం మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 28 తేదినా కరీంనగర్‌లో మహధర్నా చేయనున్నట్లు జిల్లా అధ్యక్షులు ర్యాగటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిడి రాజం తెలిపారు. హమాలి, దడవాయి, చాట, సడెం, సెక్యురిటీ గార్డ్ కార్మికులందరిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని మార్కెట్ యార్డ్ కార్మికులందరికి పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ సౌకర్యాలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులల్లో ఒకే విధమైన కూలి రేట్లు నిర్ణయించి గెజిట్ తయారు చేసి 2సం|| ఒకసారి రేట్లు రివైజ్ చేయాలని అన్ని మార్కెట్ యార్డుల్లో సం|| 2జతల బట్టలకు 200రూ|| ఇవ్వాలని ప్రమాద బీమా, జీవిత బీమాతో పాటు చనిపోయినా కార్మికులకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మార్కెట్ యార్డ్ ఆవరణలో లైసెన్స్ కార్మికులే పనిచేసే వీలు కల్పించాలని అసంఘటిత కార్మికుల షోషల్ సెక్యూరిటి చట్టం ప్రకారం వెంటనే వెల్‌ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చటో కరీంనగర్‌కు పిలుపునిచ్చామని కార్మికులు ధర్నాలో పాల్గొని విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.