ఈ పర్యటనలో చాలా నేర్చుకున్నాను : సూకీ

అనంతపురం: భారతదేశ పర్యటనలో తాను చాలా పాఠాలు నేర్చుకున్నానని మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని మడకశిర మండలంలోని గోవిందాపురం, పాపసానిపల్లె గ్రామాల్లో పర్యటించిన సూకీ అక్కడి రైతులు, డ్వాక్రా మహిళా బృందాల వారితో ముచ్చటించి వారంతా స్వశక్తితో ఆర్ధికంగా నిలదోక్కుకున్న పరిస్థితుల గురిందచి ఆడిగి తెలుసుకున్నారు.  మహిళలన ఉద్దేశించి మాట్లాడుతూ స్వశక్తితోనే సాధికారత సాధ్యమని, ఇంట్లోనే కూర్చుంటే విజయం రాదని, కష్టపడాలని ఉద్బోంధించారు. పాపసానిపల్లె గ్రామం మరింత అభివృద్ధి చెందాలని సూకీ  ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఒక కాలనీకి తన పేరు పెట్టినందుకు థన్యవాదాలు తెలియజేశారు. సూకీ పర్యటనలో పాల్గోన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఆమెకు ధర్మవరం పట్టుచీర, బుద్ధ భగవానుని ప్రతిమను బహుకరించారు.