ఈ పాఠశాలతో బాలబాలికలకు ముప్పు
కందుకూరు , జూలై 28 : విద్యాబుద్దులు అలవర్చుకోవడానికి వెళ్లిన బాలబాలికలు నిరంతరం భయంతో పాఠశాల స్లాబువైపు చూసే భయంకర పరిస్థితులు మండల పరిధిలోని కంచరగుంట మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నెలకొనివున్నాయి. పాఠశాఆల భవనాన్ని పరిశీలిస్తే పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్ధంగా ఉంది. ఈ పాఠశాలలో సుమారు 35 మంది బాలబాలికలు విద్యాబుద్దులకై వెళ్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల శిథిలావస్థకు చేరుకొని ఉండటం వలన తల్లిదండ్రులు ఏ క్షణానా ఏ దురవార్త వినాల్సివస్తుందోనన భయంతో మానసిక వేధన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ పాఠశాల శిథిలావస్థను పరిశీలించి నూతన భవన నిర్మాణానికి నిదులు కేటాయించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.