ఈ మార్పులు దేనికి సంకేతం

మంత్రివర్గ విస్తరణలో సీమాంధ్రకు సింహభాగం దక్కడం కొంత ఆశ్చర్యం.. ఇంకొంత సంభ్రమం..! అయినా ఇది దేనికి సంకేతమనేది ఇప్పటికింకా తెలియదు. భవిష్యత్‌లో ఇది దేనికి హేతువు కాబోతుందన్నది ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మార్పుల వల్ల తెలంగాణ సమస్యను పరిష్కరించబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ సమస్యకు మంత్రివర్గ విస్తరణతో ముడిపెకున్నా ఇక్కడ మాత్రం అలాంటి సందేహాలకు తావిచ్చారు.  పల్లంరాజుకు కీలకమైన మానవవనరుల శాఖను కేబినేట్‌ ¬దాలో కేటాయించారు. గతంలో దీన్ని ఉద్దండులు నిర్వహించారు. పివి నరసింహారావు, మురళీమనోహర్‌ జోషి, అర్జున్‌ సింగ్‌, కపిల్‌ సిబల్‌ లాంటి వారు దీన్ని చేపట్టారు. అలాగే పురందరేశ్వరికి వాణిజ్య పన్నులశాఱ కట్టబెట్టారు. కిల్లి కృపారాణికి ఐటి, కమ్యూనికేషన్ల సహాయమంత్రి పదవి కేటాయించారు. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి రైల్వేశాఖ సహాయమంత్రి పదవి కేటాయించారు. ఇక చిరంజీవికి స్వతంత్ర ¬దాలో పర్యాటకశాఖను కట్టబెట్టారు. కీలకమైన పెట్రోలియం శాఖను జైపాల్‌ రెడ్డి నుంచి లాక్కుని ఆయనకు శాష్తస్రాంకేతిక రంగశాఖను కేటాయించారు. సర్వే సత్యనారాయణ,  పి.బలరాంనాయక్‌లను మాత్రమే తెలంగాణ నుంచి కొత్తగా తీసుకున్నారు. మిగతా ఇద్దరు సీమాంధ్రకు చెందిన వారే.   2014 ఎన్నికలే లక్ష్యంగా కేబినెట్‌ను పునర్‌వ్యవ్థసీకరించినా ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మాత్రం కొంత జాగరూకతను చేపట్టినట్లు కనిపిస్తోంది.   ఆంధప్రదేశ్‌కు చెందిన  పళ్లంరాజు డబుల్‌ ధమాకా కొట్టారు. అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖ మంత్రిగా పళ్లంరాజుకు కేబినెట్‌ ¬దా పదోన్నతి లభించింది.ఇప్పటిదాకా టెలికాంమంత్రి కపిల్‌ సిబల్‌ వద్ద ఉన్న మానవ వనరుల శాఖను పళ్లంరాజుకు అప్పగించారు.  రాజకీయంగా సున్నితంగా మారిన ఆంధప్రదేశ్‌కు పునర్‌వ్యవ్థసీకరణలో పెద్దపీట వేశారు. ఆంధప్రదేశ్‌ నుంచి కొత్తగా ఐదుగురికి మంత్రి పదవులు దక్కాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌ఖుర్షీద్‌కు ఎంతో ప్రాముఖ్యం కలిగిన విదేశాంగశాఖ బాధ్యతలు కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక పురంధరేశ్వరికి కేబినేట్‌ ¬దా దక్కుతుందన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవ్థసీకరణలో ప్రధాని అత్యంత జాగ్రత్తలు పాటించారు. ప్రక్షాళనలో రాహుల్‌ గాంధీ ముద్ర కన్నా కూడా… ప్రధాని మన్మోహన్‌, సోనియాగాంధీల ముద్రే స్పష్టంగా కనిపించింది. యువతలో ఎవరికీ కేబినెట్‌ ¬దా కట్టబెట్టలేదు. మహారాష్ట్ర, జార్ఖండ్‌, బీహార్‌లాంటి రాష్టాల్న్రి పట్టించుకోలేదు. ఆంధప్రదేశ్‌తో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా సముచిత ప్రాధాన్యం కల్పించారు. మహారాష్ట్రలో 16 మంది పార్టీ ఎంపీలున్నప్పటికీ.. ఒక్కరికీ చోటు దక్కలేదు. అయితే తెలంగాణ సమస్య పరిష్కరించే దిశగా సీమాంధ్రకు పెద్దపీట వేశారా అన్నది కూడా చర్చ జరుగుతోంది. లేదా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్ర నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా తెలియదు. మొత్తానికి ఈ విస్తరణలో విధేయతే ప్రధానంగా కనిపించింది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అవలంబించారని కూడా స్పష్టం అవుతోంది.వికలాంగులకు ఉద్దేశించిన నిధుల్ని భోంచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌ ఖుర్షీద్‌కు ఆశ్చర్యకరంగా విదేశాంగశాఖ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటిదాకా ఆయన న్యాయ, మైనారిటీల వ్యవహారాల శాఖలు చూశారు. పంజాబ్‌కు చెందిన అశ్విని కుమార్‌ చట్టం, న్యాయశాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. ఇప్పటిదాకా విద్యుత్‌శాఖను చూసిన సీనియర్‌ మంత్రి వీరప్ప మొయిలీకి కీలకమైన పెట్రోలియం, సహజవాయువుల శాఖను కట్టబెట్టారు. ఈ శాఖను ఇప్పటిదాకా ఆంధప్రదేశ్‌కు చెందిన జైపాల్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. జైపాల్‌ను శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖలకు మార్చారు.ప్రస్తుతం పట్టణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న కమల్‌నాథ్‌కు పార్లమెంరీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు చూస్తున్న పవన్‌ కుమార్‌ బన్సల్‌ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రైల్వేశాఖకు మార్చారు. రాహుల్‌గాంధీకి సన్నిహితులుగా పేరున్న యువమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విద్యుత్‌ శాఖ స్వతంత్ర బాధ్యతలు, సచిన్‌ పైలెట్‌కు కార్పొరేట్‌ వ్యవహారాల స్వతంత్ర బాధ్యతలు, జితేంద్రసింగ్‌కు యువజన వ్యవహారాలు, క్రీడల శాఖలు అప్పగించారు.  మనీష్‌ తివారీకి సమాచార, ప్రసారశాఖల స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్‌ జట్టు కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్తో 2010 ఏప్రిల్‌లో మంత్రిపదవికి రాజీనామా చేసిన శశిథరూర్‌కు మళ్లీ కేబినెట్‌లో చోటుదక్కింది. ఆయనను మానవ వనరుల శాఖ సహాయమంత్రిగా నియమించారు. దిన్షా పటేల్‌కు గను ల శాఖలో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించింది. మొత్తానికి తెలం గాణ విషయంలో ఇప్పటికిప్పుడు చొరవచూపే అంశాలు కూడా కనిపిం చడం లేదు. బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణలను కేవలం విధేయత ఆధారంగానే మంత్రివర్గంలోకి తసీఉకున్నారన్నది సుస్పష్టం.