ఈ వారం కొత్త సినిమాల సందడి

నేడు విడుదలవుతున్న రామారావు ఆన్‌ డ్యూటీ
టాలీవుడ్‌లో ప్రతీవారం రెండు మూడు సినిమాలకు తక్కువ కాకుండా విడుదలవుతుంటాయి. టాప్‌ హీరోల సినిమాలున్నప్పుడు మాత్రం వాటి ముందో వెనుకో తమ సినిమాల్ని విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటారు ఇతర నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ వారం .. రెండు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదలవుతుండడం విశేషం. అంటే రోజుకు రెండు సినిమాల చొప్పున థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయన్నమాట. అయితే వీటిలో ఒకేరోజు రెండు వేరు వేరు భాషలకు సంబంధించిన రెండు పాన్‌ ఇండియా సినిమాలు విడుదల కావడం చెప్పుకోదగ్గ విషయం. కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ’విక్రాంత్‌ రోణా’ గురువారం థియేటర్స్‌లోకి వచ్చింది. కిచ్చా క్రియేషన్స్‌, షాలినీ ఆర్ట్స్‌, ఇన్వెనియో బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకి అనూప్‌ భండారీ (ంనిబూ దర్శకుడు. నీతా అశోక్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగింది. చెన్నైలోని ప్రముఖ శరవణన్‌ స్టోర్స్‌ అధినేత అరుళ్‌ శరవణన్‌ తొలిసారిగా హీరోగా నటిస్తూ తనే నిర్మిస్తున్న ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయిలో బరిలోకి దిగింది. దాదాపు రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. జేడీ ` జెర్రీ ఈ సినిమాకి దర్శకులు. ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా కథానాయికగా నటించింది. ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకొని కోలీవుడ్‌లో కంటిన్యూస్‌ గా సినిమాలు చేయాలనుకుంటున్నాడు శరవణన్‌. ఇప్పటికే టీజర్స్‌, సాంగ్స్‌ తో సినిమాకి మంచి క్రేజ్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఇక 29న విడుదలవుతున్న క్రేజీ తెలుగు చిత్రం ’రామారావు ఆన్‌డ్యూటీ’ . మాస్‌ మహారాజా రవితేజ యమ్మార్వోగానూ, డిప్యూటీ కలెక్టర్‌ గానూ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శరత్‌ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. దివ్యాంశ్‌ కౌశిక్‌, రజీషా విజయన్‌ కథానాయికలుగా నటిస్తుండగా.. తనికెళ్ళ భరణి, తొట్టెంపూడి వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇదే రోజు ’పంచతంత్ర కథలు’ అనే చిన్న సినిమా విడుదలకానుంది. ప్రీమియర్స్‌ తో మంచి టాక్‌ తెచ్చుకుంది కానీ.. పెద్ద సినిమాల విడుదల కారణంగా థియేటర్స్‌ దక్కని పరిస్థితి. మొత్తం విూద ఈ వారం రవితేజ ’రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం తో పాటు ఒక కన్నడ పాన్‌ ఇండియా సినిమా, ఒక తమిళ పాన్‌ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు డబ్బింగ్‌ సినిమాలకూ విడుదలకు ముందు టాలీవుడ్‌లో ఎలాంటి బజ్‌ వినిపించలేదు. ’విక్రాంత్‌ రోణా’ కు కన్నడలో మంచి ఓపెనింగ్స్‌
అంచనా వేస్తున్నారు. కానీ తెలుగులో కష్టమే అంటున్నారు. ఇక ’లెజెండ్‌’ సంగతి చెప్పనక్కర్లేదు. ఈ రెండు సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు లైట్‌ తీసుకోవడం గమనార్హం. మరి రామారావుగా రవితేజ అయినా.. బాక్సాఫీస్‌ భరతం పడతాడేమో చూడాలి