ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ..

ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం

పరాయి పాలన ఒక శాపం !
స్వపరిపాలన ఒక వరం !

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభంతో పాల‌మూరు జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేర‌బోతుంద‌ని, ఈ ప్రాంత‌మంతా స‌స్య‌శ్యామ‌లం కాబోతుంద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప‌రాయి పాల‌న పాల‌మూరు ప్ర‌జ‌ల‌కు ఒక శాపంగా మారితే.. స్వ‌ప‌రిపాల‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఒక వ‌రంగా మారింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ప్రాంత నేత‌ల బానిస మ‌న‌స్త‌త్వం, వెన్నెముక లేని త‌నం పాల‌మూరు ప్ర‌జ‌ల‌కు శాపంగా నిలిచింద‌న్నారు.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కం పాల‌మూరు – రంగారెడ్డి అని మంత్రి పేర్కొన్నారు. పాల‌మూరు ప్రాజెక్టు ముందుకు సాగ‌కుండా ప్ర‌తిప‌క్షాలు అనేక అవ‌రోధాలు క‌ల్పించారు. ప్ర‌తిప‌క్షాలు ఇబ్బందులు సృష్టించిన‌ప్ప‌టికీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌రైన వ్యూహంతో రాజ్యాంగ‌బ‌ద్ధంగా అనుమ‌తులు సాధించారు. రూ. 25 వేల కోట్ల‌తో ప్రాజెక్టు పూర్తి చేసుకుంటున్నామ‌ని చెప్పారు. ఉమ్మ‌డి పాల‌మూరు, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు అంద‌నుంది. పాల‌మూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వెట్‌ర‌న్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. 70 ఏండ్ల గోస‌కు 10 ఏండ్ల పాల‌న‌తో ప‌రిష్కారం ల‌భించింద‌ని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

తాజావార్తలు