ఉగ్రవాద హింసను ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగుల ప్రమాణం

హైదరాబాద్‌ : నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సచివాలయ ఉద్యోగులందరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రతిజ్ఞ చేయించారు. సంప్రదాయమైన అహింస, సహనం పట్ల నిబద్ధతతో ఉంటామని, ఉగ్రవాద హింసను సర్వశక్తులు ఒడ్డి, అన్ని విధాలుగా ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగులతో ఆయన ప్రమాణం చేయించారు.