ఉచిత కంటి శబిరం సక్సెస్ – అనీఫ్ మొహ్మద్
రామారెడ్డి అక్టోబర్. 18
మధన్ మోహన్ ఆద్వర్యంలో ఉచిత కంటి శబిరం సక్సెస్ అయిందని అనీఫ్ మొహ్మద్ అన్నారు. సోమవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఉచిత కంటి శిబిరం సక్సెస్ మీట్ సమావేశంలో అనీఫ్ మహ్మద్ మాట్లాడుతూ, మదన్ మోహన్ చేపట్టినటువంటి ఉచిత కంటి శిబిరం సక్సెస్ ప్రజలంరికి సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మదన్ మోహన్ ట్రస్టు ద్వారా గత నెల సెప్టెంబర్ 11వ తేదీ నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం మండల పార్టీ నాయకులు మదన్ మోహన్ కు అడగగానే ఒప్పుకొని, రామారెడ్డి మండల కేంద్రంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేసినందుకు మదన్మోహన్ ట్రస్ట్ సభ్యులు కు కృతజ్ఞతలు అని చెప్పారు. కంటి శిబిరం జరిగిన రోజున భారీ వర్షం కురిసి నప్పటికీ, ప్రజలలో భారీ స్పందన రావడం, చాలా మంది హాజరై వారి కంటి సమస్యను డాక్టర్లు పరిక్షలు చేశారని గుర్తు చేశారు. కొంతమందికి మందు-గోలీలు పంపిణీ. మరికొంత మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వారితో పాటు ఆపారేషన్ కవాలిసిన వారికి , తీవ్రమైన కంటి సమస్య ఉన్నవారికి శస్త్రచికిత్స చేసి కంటి చూపు నీ ప్రసాదించినటువంటి మదన్మోహన్ కు మండల ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు. తెలిపా రు. అంతేకాకుండా భవిష్యత్తులో నియోజక వర్గంలోని వివిధ మండలాల్లో ఓటువంటి సేవ కార్యక్రమాలం చేపట్టి ఎల్లారెడ్డి నియోజక వర్గంలో వివిధ గ్రామాల్లో చాలా మంది ఎదురు చూస్తున్నా రు వారి కోసం భవిష్యత్తులో మండలాల వారీగా క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు రాజు, సోషల్ మీడియా కన్వీనర్లు భైరయా యాదవ్, ఇర్ఫాన్,రఘు, గోపి, భాస్కర్ , నవీన్, భైరయా, రాజు తదితరులు పాల్గొన్నారు.