ఉచిత విద్య,వైద్య అందించడమే మహాభారత్ పార్టీ లక్ష్యం
*వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ అనంతవిష్ణు
మునుగోడు సెప్టెంబర్18(జనంసాక్షి):
ప్రజలకు నాణ్యమైన విద్య,వైద్యంతో పాటు అవసరమైన వసతులు కల్పించినప్పుడే ప్రాంతాలు అభివృద్ధి చెందాయని హైదరాబాద్ కు కూత పెట్టు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మునుగోడు అభివృద్ధి చెందాలంటే జై మహాభారత్ పార్టీతోనే సాధ్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
భగవాన్ అనంత విష్ణు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారే తప్ప పదవుల కోసం అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు తమ పార్టీ అభ్యర్థికి నియోజవర్గ ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని సవాలు విసిరారు.ఈకార్యక్రమంలో జాతీయ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్,రాష్ట్రఇన్చార్జి రుక్మిణినాయక్,రాష్ట్రనాయకులు పుష్పాంజలి,స్వరూప,పద్మజ,లలితభాయ్,స్వరూప,పద్మజ,లలితాభాయ్,యూత్ వింగ్ రేఖ,జయశ్రగౌడ్,సంపత్ సామాజిక మాధ్యమాల కోఆర్డినేటర్ పార్టీ ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి,మునుగోడు ఇంచార్జ్ మేడి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.