ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన.
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య శిబిరాలు దోహదపడతాయని టిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం నేరేడ్ మెట్ డివిజన్ లోని చంద్రబాబు నాయుడు బస్తీలో దుండిగల్ అరుంధతి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈవైద్య శిబిరంలో బిపి,షుగర్,కంటి,చెవి, గుండె పరీక్షలతోపాటు జనరల్ పరీక్షలు చేసి 150 మందికి ఉచితంగా మందులు అందజేశారు.రోగ నిర్ధారణ పరీక్షలలో అవసరం ఉన్న వారిని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేస్తామని డాక్టర్లు తెలిపారు.ఈసందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.బస్తీలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాజు,చెన్నారెడ్డి,డాక్టర్లు ఉదయ్ కుమార్,హైదర్ అబ్బాస్,ఆనంద్, స్థానికులు కాశయ్య,గిరిబాబు,నరేష్, లక్ష్మణ్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.