ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

 

 

జహీరాబాద్ డిసెంబర్ (జనం సాక్షి ) మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామంలో జరిగిన సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు. శిబిరం లో 175 మంది వరకు గ్రామస్తులు పాల్గొని వైద్య సేవలు పొందుకున్నారు. ఈ సందర్భంగా డబ్లు ఎచ్ ఆర్.ఆర్ కె. జహీరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మసన్నగారి నర్సిములు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఈశ్వర్ పాటిల్, డాక్టర్ హరీష్ వర్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.