ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు 29

హౌసింగ్‌ బోర్డుకాలనీ, న్యూస్‌టుడే:ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తు రక్షక భటుల రాత పరీక్షకు ఇవెంట్స్‌లో అర్హత సాధించి పరీక్షకు హజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇసున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 29లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో సామగ్రి ఉపకార వేతనం అందజేస్తారని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారన్ని స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో గడువు తేదీలోగా అందజేయాలని సూచించారు.