ఉత్కంఠ పోరులో బెంగుళూర్‌ విజయం

ఐపీఎల్‌లో అసలు మజా మరోసారి పునరావృతమైంది. బెంగుళూర్‌ ,ఢిల్లీ జట్ల మద్య మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ బెంగుళూర్‌ సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ జట్టు పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 152 పరుగులుచేసింది .తర్వాత లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూర్‌ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూర్‌ 15 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రెండు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.