ఉత్తరాఖండ్ లో మ్యాగి న్యూడిల్స్ నిషేధం

ఢిల్లీ: మ్యాగీ న్యూడిల్స్ పై తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దేశమంతటా ప్రకంపనలు కనిపించాయి. స్విస్ బహుళజాతి సంస్థ భారత విభాగం నెస్లే ఇండియాకు దెబ్బ మీద దెబ్బ తాకింది. ఢిల్లీలో 15 రోజుల పాటు నిషేధం విధించగా, మ్యాగీని తినొద్దంటూ సైన్యం తమ సిబ్బందికి సూచించింది. రిటైల్ దిగ్గజం బిగ్ బజర్ అమ్మకాల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మరో వైపు ఉత్తరాఖండ్ లో కూడా నిషేధం విధించింది. మరో వైపసు తెలుగు రాస్ట్రాల్లో మ్యాగీ నూడిల్స్ పై పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల నుంచి శాంపిల్స్ సేకరించామని మంగళవారం ప్రభుత్వాలకు తుది నివేదిక అందజేస్తామని ఐపీఎం ఫుడ్ డైరెక్టర్స్ మంజీర, అమరేందర్ నాథ్ రెడ్డి తెలిపారు.