ఉత్తరాదిలో వర్షబీభత్సం


రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ

చండీఘడ్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తరభారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆకాశమంతా మబ్బులతో  కమ్మేసి బలమైన ఈదురుగాలులతో చండీఘర్‌..చుట్టుపక్కల ఏరియాల్లో వర్షం దంచికొడుతుంది. మరోవైపు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో మెట్రోలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులు  తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా మంగళవారం వరకూ రెండురోజులపాటు స్కూళ్లకు హర్యానా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రైవేటు స్కూళ్లు కూడా రెండురోజులు సెలవులు ప్రకటించాయి. 13 రాష్ట్రాలు  రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ఉరుములతో కూడిన అధిక వర్షాలు పడే అవకాశముందని  కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ తెలిపింది. అస్సామ్‌, మేఘూలయ, మణిపూర్‌, త్రిపుర, మిజోరామ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలలో  సోమవారం అధిక వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరోవైపు గాళిధుమ్ము కారణంగా ఉత్తరభారతంలో గతవారం 100 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
————