ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం

జమ్మూ కశ్మీర్, ఆగస్టు 10: ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. జమ్మూ కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో సహా పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్‌లో, కజకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల్లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రకంపనల తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి భయటికి పరుగులు తీశారు. భూకంప కేంద్రం హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ నిర్థారించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2గా భూకంప తీవ్రత నమోదైంది.