ఉదయాన్నే హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు*
గుర్రంపోడు గిరిజనుల పోడు
భూముల కొరకే చేపట్టిన గిరిజన భరోసా యాత్ర కార్యక్రమానికి నేటికి సంవత్సరకాలం పూర్తయిన ఈరోజున కోదాడ బిజెపి పార్టీ కార్యకర్తలతో సమావేశంలో తన ఇంటి వద్ద ఉండగా ఉదయం నుండి హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా, అన్యాయంగా నిర్బంధించి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నే బలవంతంగా రాష్ట్ర బిజెపి నాయకులు ఓర్సూ వేలంగి రాజు తో పాటు నియోజకవర్గం బిజెపి పార్టీ కార్యకర్తలను టిఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అన్యాయంగా ప్రివెంటివ్ అరెస్ట్ చేసినారు అని తెలిపారు. అరెస్టు అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు మాట్లాడుతూ పేద, పీడిత, బడుగు బలహీన వర్గాల, దళిత, గిరిజనుల కొరకు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం చేత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్రమార్కులు కబ్జాదారులు అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అని భయానికి లోనై అందరూ ఒకటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు కుమ్మక్కై పోలీసు వారిని అడ్డుపెట్టుకొని న్యాయం కోసం పోరాడిన వారిని అన్యాయంపై ప్రశ్నించే వారిని కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదని అని అన్నారు. భవిష్యత్తులో అవినీతి అరాచక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేంతవరకు కు సామాజిక న్యాయం కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు