ఉద్యమంలా హరితహారం కార్యక్రమం
కలెక్టర్ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు
జనగామ, జూలై 23 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. జనగామను గ్రీన్‌హబ్‌గా మారుద్దాం అంటూ కలెక్టర్ పిలుపునివ్వడమే కాకుండా కార్యక్రమ విజయవంతం పై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు. హరితహారం ప్రారంభమైన తరవాత 50 రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జనగామ జిల్లాలో జోరుగా సాగేలా కార్యక్రమాలను రూపొందించారు. వానలు కూడా సహకరిస్తుండడంతో అన్ని వర్గాలు ఉత్సాహంగా మొక్కలు నాటడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. వానలు కురువాలంటే వృక్షాలు ఉండాలి అనే విషయాన్ని సామాన్య జనానికి అర్థం అయ్యేలా అధికార యత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చలహారం పనులు కనిపిస్తున్నాయి. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో కనీసం 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశిరచారు. ఊరూరా ఉద్యమంలా మొక్కల పెంపకం సాగాలని ప్రచారం చేస్తున్నారు. గతేడాది జిల్లాలో కోటి 44 లక్షల సీడ్‌బాల్స్ తయారు చేసిన ప్రజలు వాటిని ఖాళీ ప్రదేశాలు, కొండలు, గుట్టలున్న చోట చల్లారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచే ధ్యేయంతో సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా పల్లెల నుంచి పట్టణాల వరకూ హరితోద్యమం నిర్వహిస్తున్నారు. వానలు వాపస్ రావాలంటే మొక్కలను విరివిగా పెంచాలన్న సీఎం కేసీఆర్ నినాదాన్ని గులాబీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో హరితహారం రోజురోజుకు జోరందుకుంటోంది. అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సవిూక్షలు చేస్తూ మొక్కల పెంపకం విజయవంతం కావడానికి దిశా నిర్ధేశర చేస్తున్నారు. జిల్లాకు చెందిన జనగామ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులతో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. దీంతో జిల్లాలో ఒక శాతం ఉన్న అడవులను 33శాతానికి పెంచాలన్న లక్ష్యంతో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ప్రస్తుతం జనగామ జిల్లాగా ఏర్పాటు కావడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పోరాడి తెచ్చుకున్న జనగామ జిల్లాను గ్రీన్‌హబ్‌గా మార్చడంలో భాగంగా జిల్లా మొత్తంగా 85లక్ష ల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీ 40వేల మొక్కలకు తక్కువ కాకుండా నాటాలని నిర్ధేశిరచుకున్నారు. అన్ని మండలాలు అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. గత వేసవి నుంచే ప్రత్యేక కార్యాచరణతో అటవీశాఖ, డీఆర్‌డీఏ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతూ నర్సరీల్లో మొక్కలను పెంచారు. కోటి మొక్కలు లక్ష్యంగా చేసుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 26నర్సరీల్లో మొక్కలు పెంచడంతో ఇప్పుడు అవి నాటడానికి అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని అన్ని శాఖలు తమ వంతుగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాయని అటవీ అధికారులు తెలిపారు.