ఉద్యమనేత.. నాయినికి అశ్రునయనాలతో వీడ్కోలు
– ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
– పాడె మోసిన మంత్రులు కెటిఆర్, శ్రీనివాస గౌడ్
– భారీగా హాజరైన నేతలు, పార్టీ శ్రేణులు
– నాయిని మరణం తీరని లోటు
– దిగ్భాంతి వ్యక్తంచేసిన సిఎం కెసిఆర్
– మంత్రులు, నేతల దిగ్భాంతి..ఘనంగా నివాళి
హైదరాబాద్,అక్టోబరు 22(జనంసాక్షి): తెలంగాణ మాజీ ¬ంమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్ర స్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. నాయినిని కడసారి చూసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నాయిని అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. వ ఏలదిగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు ఆయనకు నివాళి అర్పించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని.. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి సతీమణి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తను కడసారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మహాప్రస్థానానికి చేరుకుని శ్రద్దాంజలి ఘటించారు. భర్తను తలుచుకుంటూ ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు. నాయిని అంత్యక్రియల్లో భాగంగా మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ఆయన పాడెను మోశారు. ఆ తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు నాయిని పాడె మోసి నివాళుల ర్పించారు. తమ ప్రియతమ నేతను కొల్పోయినందుకు కార్యకర్తలు కన్నీటి పర్యంతమవుతుండగా దీన్ని అవకాశంగా తీసుకున్న జేబు దొంగలు రెచ్చిపోయారు. అంత్యక్రియల్లో పోలీసుల కళ్లు గప్పి చేతివాటం ప్రదర్శించారు. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది టీఆర్‌ఎస్ నేతలతో పాటు ఆయనతో కలిసి పనిచేసిన నేతలు వచ్చారు. ఇంతటి దు:ఖ సమయంలోనూ జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పలువురు టీఆర్‌ఎస్ నేతల జేబుల్లో ఉన్న నగదు కొట్టేసి తమ జేబుల్లోకి సర్ధుకున్నారు. అయితే ఓ నేత జేబులో నుంచి నగదును తీస్తుండగా అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకేముంది సదరు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
నాయిని మరణం తీరని లోటు
– దిగ్భాంతి వ్యక్తంచేసిన సిఎం కెసిఆర్
నాయిని మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. బుధవారం సాయంత్రమే సిఎం అపోలో వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీసారు. రాత్రి మృతి చెందినట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని పాత్ర మరువలేనిది గుర్తుచేశారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాయిని మృతిపట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. నాయిని మృతిపై కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. నాయిని మృతిపట్ల మంత్రి నిరంజన్‌రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం పార్టీకి, తెలంగాణకు తీరని లోటన్నారు. నాయిని కుటుంబ సభ్యులకు నిరంజన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని నిరంజన్ రెడ్డి అన్నారు. అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేశారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని, నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయినితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఉద్యమాలు, త్యాగాలు, పదవులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి అని, వారి హక్కుల్ని కాపాడారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మరణం చాలా బాధకమని దిగ్భాంతి వ్యక్తం చేశారు. నాయినిది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థివదేహాన్ని ఆయన ఉదయం తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో కలసి సందర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా తొలి తెలంగాణా ప్రభుత్వంలో ¬ంమంత్రిగా పనిచేశారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుండి తొలి తెలంగాణా మంత్రి వర్గంలో నాయినితో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
నాయిని తనకు అత్యండ ఆత్మీయుడని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వాసి అని, ఆయన తమకు ఆదర్శం అన్నారు. నాయిని చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన్ని చూసి ప్రభావితుడనై రాజకీయాల్లోకి వచ్చానని జానారెడ్డి అన్నారు. నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ¬ంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన మరణం పట్ల ప%