ఉద్యోగాల భర్తీలో కానరాని చిత్తవుద్ది

 

 

-తెలంగాణా వస్తే ఇంటికో ఉద్యోగం అనలేదా?

నిరుద్యోగులకు అండగా బీజెవైఎం

మెదక్‌,నవంబర్‌21  (జనం సాక్షి) : తెలంగాణా వస్తే బతుకులు బాగుపడుతాయనుకున్నామని, ఇంటికో ఉద్యోగం

ఇస్తామన్న ముఖ్యమంత్రి మాటలను నమ్మి ఓటేస్తే కనీసం తమను ప్రశ్నించే హక్కు, శాంతియుతంగా ఆందోళన కూడా చేసే అవకాశం లేకుండా నయా నిజాంలా కేసీఆర్‌ వ్యహరిస్తున్నాడని బీజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ నేతలంతా వేలాది సభల్లో సందర్బాల్లో వల్లె వేసింది కాక మేమెక్కడా ఇంటికోఉద్యోగం ఇస్తా మని చెప్పలేదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చురకలంటించారు. ప్రైవేట్‌ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పి మరోసారిమసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోఅధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచిపోయిందని ఎన్నివేల ఉద్యోగాలిచ్చారో శాఖలవారిగా శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. కేవలం 15 వేలే మాత్రమే ఇచ్చారని ఇందులో కూడా 10వేలు కానిస్టేబుల్లవేనని, వీరిని నిరుద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు రోడ్లపైకి ఎక్కి ఎక్కడా ఆందోళనలు చేయకుండా నిరోధించేందుకు తాపత్రయ పడుతున్నాడన్నారు. తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడు తున్నసమయంలో నాడు పాలకులు పోలీస్‌ యాక్ట్‌ 30 లు, 144 సెక్షన్‌లు అమలు చేసి ఉంటే ఆందోళనలు సాగేవా…తెలంగానా రాష్ట్రం ఆవిర్బవించేదా అని నిలదీశారు. తెలంగాణా స్వరాష్ట్రంలో ఎలాంటి కేసులు లేకుండా నిర్బయంగా ఉద్యోగాలువచ్చి కుటుంబం అంతా హాయిగా బతుకచ్చనుకున్న సామాన్యుడిని అణగతొక్కి తన కుటుంబంలో మాత్రం నాలుగు ముఖ్య ఉద్యోగాలు సంపాదించుకుని కోట్లకు పడగలెత్తుతున్నారని మండిపడ్డారు. ఓవైపు నిరుద్యోగులు తినడానికితిండి దొరకక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్‌పీఎస్సీ పాలకులకు మాత్రం లక్షలకు లక్షలు వేతనాలిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. టీఎస్‌పీఎస్‌ చేస్తున్న నిర్వా కం చూస్తే ప్రతిఒక్కరు నవ్వు కుంటున్నారని, గ్రూప్‌ వన్‌ అధికారుల నియామకంలో వ్యవహరించినతీరు, గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణ, ఇటీ వలే 50వేల మంది పరీక్షా కేంద్రాల్లో వైట్‌నర్‌ తో ఓఎంఆర్‌షీట్లను మార్చుకున్న సంగతి సిగ్గుగా అనిపించడంలేదా అని నిలదీశారు. యుపిఎస్‌సీకి దీటుగా టీఎస్‌పీఎస్‌సీని తీర్చిదిద్దుతామన్న కేసీఆర్‌ ఆనాడు కేవలం నలుగురు డైరెక్టర్లుంటే నేడు15మంది డైరెక్టర్లను నింపుకుని రిటైర్‌ ఆయిన వారికి దొడ్డిదారిని ఉపాది కల్పిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు అండగా బీజెపి, బీజెవైఎం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్బావం నాటికి మిగులు బడ్జెట్‌తో ఉండేదని నేడు లక్షా 50వేల కోట్ల అప్పుల్లోకి నెట్టి వేశారని, ఈ నిధులన్నీ కూడా కవిూషన్‌ కాకతీయ, కవిూసన్‌ మిషన్‌ భగీరథలద్వారా సీఎం తదితర నేతల జేబుల్లోకి వెల్లాయని ఆరోపించారు.