ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షల నగదు చోరీ

అమీర్‌పేట, హైదరాబాద్‌ : బ్యాంక్‌ నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షలను దుండగులు అపహరించు కుపోయారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి నగదును తీసుకువెళ్తున్న జగదీశ్‌  అనే ఉద్యోగి సిద్దార్థ్‌నగర్‌ పార్కు సమీపంలోకి చేరుకోగానే వెనక నుంచి భైక్‌పై వెంబడించిన ఇద్దరు దుండగులు అతన్ని తోసేసి బ్యాగు లాక్కొని పారిపోయారు. బాధితుడు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.