ఉద్యోగ నియామకాలు తక్షణం చేపట్టాలి

యువతకు అవకాశాలు పెంచాలి

ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ కోరింది. ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు, ఉద్యోగాల కల్పన కోసం యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. డిఎస్‌సితో పాటు గిరిజన, మైనారిటీ స్పెషల్‌ డిఎస్‌సి నోటికేషన్లు వెంటనే విడుదల చేయాలని, పంచాయతీ కార్యదర్శి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, ఎపిపిఎస్‌సి క్యాలెండర్‌ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 16.57 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేసింది. అలాగే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, వికలాంగ బ్యాక్‌లాగ్‌ సోస్టులు భర్తీ చేయాలని, కొర్పొరేటు విద్యా సంస్థలను నియత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ, కళాశాల, ప్రతి మండలంలో జూనియర్‌ రెసిడెన్షియల్‌ కళాశాల, ఏర్పాటు చేయాలని, యూత్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని డివైఎఫ్‌పై డిమాండ్‌ చేసింది. ప్రత్యేక ¬దా, విభజన చట్టం అమలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వికలాంగ, కాపు కార్పొరేషన్ల ద్వారా అర్హులైన యువతకు రుణాలు వెంటెనే చెలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యేక ¬దా, విభజన హావిూల అమలు, ఉద్యోగాల కల్పన కోసం యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లోని అంశాల అమలు కోసం సిపిఎం, సిపిఐ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఒకపక్క అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు పోతున్నాయన్నారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం శోచనీయమని జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అన్నారు.