ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించాలి…..
తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్……
కరీంనగర్ రూరల్/జనంసాక్షి ;—– తెలంగాణ రాష్ట్రం లో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించి ప్రభుత్వం చిత్త శుద్ధి చాటుకోవాలని తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తక్షణమే చొరవ తీసుకుని ఉద్యోగ నోటిఫికేషన్ ల దిశగా ప్రయత్నం చేయాలని హితవు పలికారు.ఏటా లక్షలాది మంది యువత చదువు కుని ఉద్యోగాలు లేక నిరుద్యోగుల గా కాలం వెళ్ళ దీస్తూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్,రాజు,సురేష్,శేఖర్, హరీష్ పాల్గొన్నారు.