*ఉధృత డయేరియా నియంత్రణ పక్షోత్సావ కార్యక్రమము ప్రారంభించిన ఎంపీపీ శైలజ*
పెబ్బేరు జూన్ 13 ( జనంసాక్షి ): పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉధృత డయోరియా నియంత్రణ పక్షోత్సవాని ఎంపీపీ అవుల శైలజ కురుమూర్తి, మండల జెడ్పీటీసీ పద్మ వెంకటేష్ ప్రారంభించారు. ఉధృత డయోరియా కార్యక్రమం ఈనెల 27 వరకు ఉంటుంది. మున్సిపాలిటీ, గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో
మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కర్రేస్వామీ , స్థానిక వైద్య అధికారులు డా. సాయి శ్రీ ,డా. షేఫీ, డా.అనిల్, పి.హెచ్.ఎన్ సత్యామ్మ, హెల్త్ సూపర్ వైజర్ సూర్య నారాయణ, వెంకట సుబ్బమ్మ, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, తిరుపతయ్య, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ గౌడ్, వెంకటమ్మ, శారద, మండల ప్రజలు మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు