ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గం – అక్కల తిరుపతి వర్మ

సేవా భావాన్ని చాటుకున్న హైకోర్టు న్యాయవాది…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 800 బస్ పాస్ లు పంపిణి…

మంచిర్యాల :-మంచిర్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 800 మంది విద్యార్థులకు ఉచితంగా బస్సు పాస్ లు అందించారు.. మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, ముల్కల్లా, రాపల్లి, దొనబండ, దండపల్లి, లింగాల, లక్షెట్టిపేట్, లింగాపూర్, గూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి దూర ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు వారి ఇబ్బందులను, ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని ఉచితంగా బస్సు పాసులు అందించారు. అనంతరం అక్కల తిరుపతి వర్మ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల అవసరాలను తెలుసుకొని, ముఖ్యంగా పాఠశాలకు వచ్చేందుకు బస్ చార్జీలు అధికమవుతున్నాయని, ఆర్థిక భారం, కుటుంబ ఇబ్బందులతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని, అది గమనించి పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులకు బస్సు పాసులు అందించడం జరిగిందని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్న, ఇబ్బందులు ఉన్న నా దృష్టికి వస్తే వారికి సహాయం చేసే దిశగా ఎల్లప్పుడూ తోడుంటానని హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకొని, పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గమని విద్యార్థులకు సూచించారు