ఉపాద్యాయులే ధాతలుగా నోట్ బుక్స్ పంపిణీ.
జనగామ (జనం సాక్షి )జూలై7: ఉపాద్యాయులా సహకారంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ
గౌట్ ఎయిడెడ్ ఎబివి హై స్కూల్ హెడ్మాస్టర్ సి. హెచ్ శోబా కిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త పాల్గొని ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది .ఈ సందర్భంగా హరిచంద్ర గుప్తా మాట్లాడుతూ స్కూల్లో చదివే అందరు కూడా చాలా పేదవారిని వారికి కొనే స్తోమత లేదు అని అందుకుగాను టీచర్స్ అందరు కూడా అనుకోని స్కూల్లో పిల్లలు అందరికీ ఉచితంగా క్లాసుకు సరిపడే నోటుబుక్సు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని. ఈ సందర్భంగా స్కూల్ ఉపాద్యాయుల బృందానికి హరిశ్చంద్ర గుప్త అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొత్తూరు వాసు జైన శశికళ యెర్రము రాజ్యలక్ష్మి లగేశెట్టి విజయ్ నాగరాజు సంపత్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




