ఉపాధిహావిూలో ఏపీ అగ్రస్థానం

రెండు నెలల్లో 1500కోట్లకుపైగా నిధులు ఖర్చు
కూలీలకు 760 లక్షల పనిదినాలు కల్పించిన ప్రభుత్వం
అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91.84 లక్షల పనిదినాలు
అమరావతి, జూన్‌14(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో ఉపాధి హావిూ పనులు పరుగులు పెడుతున్నాయి. ఉపాధికి భరోసా కల్పిస్తూ రెండు నెలల్లోనే 15వందల కోట్లకు పైగా నిధులు ఖర్చుచేసి ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. కూలీలకు 760 లక్షల పని దినాలు కల్పించడంతో పాటు జాతీయస్థాయిలో ఆంధప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. గత రెండు నెలల్లో నిర్వహించిన ఉపాధి హావిూ పనులపై కేంద్రం అన్ని రాష్టాల్ర పనితీరును విశ్లేషించి తాజాగా ర్యాంకులు ప్రకటించింది. మొత్తం ఐదు కేటగిరీల్లో ఆంధప్రదేశ్‌ నాలుగింటిలో ప్రధమస్థానంలో నిలిచింది. పనుల నిర్వహణ, కూలీల పనిదినాల కల్పన, జాబ్‌ కార్డులు పొందిన కుటుంబాలకు పని కల్పించడం, వ్యక్తిగత ఆస్తుల ఏర్పాటులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కూలీలు గత మూడేళ్ల కంటే అత్యధికంగా కనీస వేతనాలు అందుకుంటున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలో కూలీలకు 760 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో రూ.1526కోట్ల వేతన నిధులు ఖర్చుచేశారు. గత ఏడాది ఇదే రెండు నెలల్లో చేసిన ఖర్చుతో పోల్చితే ఇది 36శాతం ఎక్కువ. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91.84 లక్షల పనిదినాలు కల్పించారు. గత రెండు నెలల్లో చేపట్టన ఉపాధి పనులకు హాజరయిన కూలీలకు గరిష్ఠంగా రూ.200 కనీస వేతనం అందుతోంది. ఈ ఏడాది ఉపాధి కూలీల కనీస వేతనం 205 రూపాయలుగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 70లక్షలకు పైగా ఉన్న జాబ్‌ కార్డు ¬ల్డర్లలో రోజూ దాదాపు 28లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. సరాసరి వీటి సంఖ్య 18లక్షలకు పైగా ఉంటుందని అంచనా.