ఉపాధి కూలీల ధర్నా

దండేపల్లి: దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయం ముందు స్థానిక ఉపాధి కూలీలు పని కల్పించాలంటూ బుధవారం ధర్నా చేశారు.ప్రభుత్వం ఏడాదికి 150 రోజుల పని కల్పిస్తున్నామని చెప్తున్నా స్థానిక అధికారులు మాత్రం తమకు పని కల్పించడంలేదంటూ వారు కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేశారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి పెర్క రాజేశ్‌ మాట్లాడుతూ ఏడాదికి 150 రోజులు పని కల్పించాలని,ఒక్కరోజు వేతనం 150కి తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.పనిచేసే ప్రదేశంలో కూలీలకు నీడకోసం షామియాలు, నీటి సౌకర్యం, పనికి అవసరమైన సామాగ్రి ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం ఏపీవో మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.