ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : 2012 డీఎస్సీకి ముందు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిటిఎఫ్‌ సంఘం డిమాండ్‌ చేసింది. డీఎస్సీ పోస్టింగులు ఇవ్వకముందే అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో రెండుసార్లు ఏజెన్సీ సమస్యపై ప్రభుత్వ జీవో 3పై స్పష్టమైన మార్గదర్శకాలు లేనందున పదోన్నతుల కౌన్సెలింగ్‌ వాయిదా పడిందని అన్నారు. డీఎస్సీకి ముందు పదోన్నతులు కల్పించకపోతే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు భవిష్యత్‌లో సీనియారిటీని కోల్పోయ్యే అవకాశం ఉన్నందున వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి అన్ని ఉపాధ్యాయ సంఘాలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.