ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి..
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
జనం సాక్షి /కొల్చారం
మండల కేంద్రం కొల్చారం లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు.బోధన తరగతుల గదుల్లోకి వెళ్లిన అదనపు కలెక్టర్ తొలి మెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్య విధానాన్ని స్వయంగా పరిశీలించారు.విద్యార్థులకు బోధనోపకరణాల ద్వారా అందిస్తున్న విద్యపై ఆరా తీశారు.బోధన అంశాలపై ప్రశ్నలు వేస్తూ విద్యార్థుల నుండి సమాధానాలను రాబట్టారు.9,10 విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అక్కడి బోధనా సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతతో కూడినదై ఉండాలని ఆదేశించారు.విద్యార్థుల భవితకు బాట వేసే విధంగా విద్యా విధానం కొనసాగాలన్నారు.అక్కనుండి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీయడంతో పాటు స్వయంగా పరిశీలించారు.టాయిలెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం,వంట గది ఇరుకుగా ఉండడం పై అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన మనమంతుల కోసం వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు సూచించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేలా పాఠశాల సిబ్బంది దృష్టి సారించాలన్నారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రమేష్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,పాఠశాల సిబ్బంది ఉన్నారు