ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి : గంగారెడ్డి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 1 (: ఉపాధ్యాయుల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, కార్యదర్శి యాదవరావులు డిమాండ్‌ చేశారు. జీవో 86 ప్రకారం ప్రభుత్వం ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీలను చేపట్టాలని, ప్రతి నెల ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని  వారు డిమాండ్‌ చేశారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఎకీకృత సర్వీస్‌ రూల్స్‌ను వెంటనే పరిష్కరించి కొత్త డిఎస్సీని ప్రకటించాలని కోరారు.