ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లచ్చిరాం
సూర్యాపేట (జనంసాక్షి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బేర దేవన్న , రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లచ్చిరాం అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.బదిలీలు,పదోన్నతులు వెంటనే చేపట్టాలన్నారు.ఎంఈఓ పోస్టుల భర్తీ లేకపోవడంతో పాఠశాల విద్యలో తీవ్ర సంక్షోభం నెలకొందని , ఉన్నత పాఠశాలలలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉందన్నారు.ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేరని తెలిపారు. డిఈఓ , డిప్యూటీఈఓ , ఎంఈఓ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. 317 జీఓ బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు.సీపీఎస్ విధానాన్ని రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.అవసరమైన చోట విద్యా వాలంటీర్లను నియమించాలన్నారు.పాఠ్యపుస్తకాలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీమనోహర్ రెడ్డి, రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి మొగిలయ్య , రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గోపాల్, రాష్ట్ర సహాధ్యక్షులు దామెర శ్రీనివాస్ , నూతనకంటి బాబు , జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కస్తూరి కిషన్ ప్రసాద్, మామిడి అరవింద్, నాయకులు జానకి రాములు , రవికుమార్ , చలమందరావు , చంద్రశేఖర్ , శ్రీనివాస్ , వెంకన్న , జోహార్ , వెంకన్న , శ్రీనయ్య , మహ్మద్ షఫి, శ్రీనివాస చారి, శ్రీనివాస్, నరసింహ స్వామి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|