ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పీఆర్టీయూ కే సాధ్యం

సిద్దిపేట జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధరశర్శ, పత్రికా సంపాదకులు వూడెం జైపాల్ రెడ్డి
జగదేవ్ పూర్ , ఆగస్టు  27 జనం సాక్షి:
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే ఏకైక  సంఘం  ఒక్క పీఆర్టీయూ సంఘమేనని సిద్దిపేట జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధర శర్మ, పీఆర్టీయూ పత్రికా సంపాదకులు వూడెం జైపాల్ రెడ్డిలు  స్పష్టం చేశారు.  శనివారం జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో  పీఆర్టీయూ మండల అధ్యక్షుడు చిలుకూరి వెంకట్రామ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కుకునూరు శేఖర్ ల ఆధ్వర్యంలో  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ సంఘం చిత్తశుద్ధితో  కృషి చేస్తుందన్నారు. గతంలో  ఎన్నో తీవ్రమైన సమస్యలను కూడా ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి అన్ని సమస్యలు పరిష్కరించిన ఘనత   పి ఆర్ టి యు కే దక్కిందన్నారు. ఈ క్రమంలో పీఆర్టీయూ సంఘంపై విశ్వాసంతో ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మునిగడప ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండీ రహీం, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. యాదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కే. ప్రభాకర్  సీనియర్  నాయకులు ఏ.శ్రీనివాస్, భగవాన్ రెడ్డి, మునిగడప ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పిఆర్టియు నాయకులు  శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎల్లయ్య మధుసూదన్, పద్మ, వెంకటయ్య, నవీన్ కుమార్, రామకృష్ణ, అశ్విని* తదితరులు పాల్గొన్నారు