ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ అర్రం వినయ్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలి

 

 

 

 

 

 

ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వి.సత్యనారాయణ

కొడంగల్, నవాబుపేట్, గురుకుల పాఠశాలల్లో విస్తృత ప్రచారం

వికారాబాద్ రూరల్ మార్చ్ 9( జనం సాక్షి )
చేవెళ్ల, వికారాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ అర్రం వినయ్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కమిషన్ ప్రొఫెసర్ అర్రం విజయ్ బాబుకు బ్యాలెట్ పేపర్ పై సీరియల్ నెంబర్ 5ను కేటాయించిందని సంఘం వివరించింది. గురుకుల అధ్యాపకుల, ఉపాధ్యాయుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ అర్రం వినయ్ బాబును ఏమ్మేల్సిగా గెలిపిస్తే సమస్యల తక్షణ పరిష్కారం లభిస్తుందని సంఘం పేర్కొన్నది. వినయ్ బాబు గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించింది. గురువారం నాడు చేవెళ్ళ మండలంలోని ముడిమ్యాల్ లో ఉన్న కొడంగల్ గురుకుల పాఠశాల, అలాగే ధర్మాసాగర్ సమీపంలో ఉన్న నవాబుపేట్ గురుకుల పాఠశాలలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వి.సత్యనారాయణ మాట్లాడుతూ గురుకుల, అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వినయ్ బాబును ఎమ్మెల్సీగా గెలిపించాలని, విజ్ఞప్తి చేశారు. వేలాదిమంది ఉపాధ్యాయుల హక్కుల కోసం వినయ్ బాబు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. గురుకుల అధ్యాపకులకు దీర్ఘకాల పెండింగు సమస్యలపై వినయ్ బాబుకు మంచి అవగాహన ఉన్నదని, హెల్త్ కార్డులు, గురుకుల అధ్యాపకులకు, హెల్త్ కార్డులు లేవని జిపిఎఫ్ రాదని, సకాలంలో జీతాలు రావని వీటన్నిటి పరిష్కారానికి ప్రొఫెసర్ వినయ్ బాబుకు ప్రధమ ప్రాధాన్యత ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని వి.సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కె. వెంకట్ రావు , గురుకుల అధ్యాపకులు, సీనియర్ జర్నలిస్టులు కడమంచి ఆనంద్, ఇనాయత్ , సామాజిక కార్యకర్త నాగేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ వినయ్ బాబుకు మద్దతుగా చేవెళ్ల, వికారాబాద్, నవాబుపేట్ ,అధ్యాపక సిబ్బందితో కలిసి ప్రొఫెసర్ అరుణ్ వినయ్ బాబు ప్రచార కరపత్రాన్ని అధ్యాపక సిబ్బంది చే ఆవిష్కరించారు.