ఉపాధ్యాయ పదోన్నతి బదిలీల షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలి

మన ఊరు మనబడి కి  3వేల కోట్ల నిధులు విడుదల చేయాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మిర్యాలగూడ, జనం సాక్షి :
ఉపాధ్యాయ పదోన్నతి, బదిలీల షెడ్యూల్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టీఎస్ యుటిఎఫ్ నూతన టీచర్స్ భవనం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని మన డిమాండ్ చేశారు. “బడులు బాగు కావాలంటే” పదోన్నతులు బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు. 2015 నుంచి ప్రధానోపాధ్యాయులును భర్తీ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,940 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో 9 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, 4,వేల పోస్టులను పండిత్ లు, పిఈటిలు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 18 వేల పోస్టులను పదోన్నతుల  ద్వారా బాధ్యత అన్నారు. రాష్ట్రంలోని 50 శాతం స్కూల్లో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానం ఉందన్నారు. సరైన సౌకర్యాలు లేవని విద్యాశాఖ  నుంచి 200 కోట్ల రూపాయలు నిధులు పాఠశాలలో పారిశుధ్యం పై ఖర్చు చేస్తే పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించవచ్చన్నారు. “మన ఊరు మన బడి” కార్యక్రమం ద్వారా నిధులు మంజూరు చేయకపోవడంతో అనేక పాఠశాలలో 30% పనులు కూడా జరగలేదన్నారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పన కోసం మన ఊరు మనబడి కార్యక్రమానికి వెంటనే మూడు వేల కోట్ల నిధులు మంజూరు చేసి వచ్చే మార్చినాటికి పనులు పూర్తి చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
“విజ్ఞాన కేంద్రం”గా యుటిఎఫ్ కార్యాలయం ఉపయోగపడాలి
విజ్ఞాన కేంద్రముగా యుటిఎఫ్ కార్యాలయం ఉపయోగపడాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాల పట్నంలో టీఎస్ యుటిఎఫ్ నూతన భవనం టీచర్స్ భవాని భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణంలో కృషిచేసిన యూటీఎఫ్ బాధ్యులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంగారయ్య, ఎంఈఓలు బాలాజీ నాయక్ చత్రునాయక్, బాలు నాయక్,  బక్క శ్రీనివాస్ చారి, నాగమణి, శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ చంద్ర, మంగ్యా నాయక్, భీమ్లా నాయక్, వెంకన్న, పాల్వాయి శ్రీనివాస్ మధుసూదన్, జాకీర్ హుస్సేన్, పాష, తదితరులు పాల్గొన్నారు.