ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి:-బంజారా ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు దశరధ నాయక్

మిర్యాలగూడ.ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోని ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల పోస్టులను ఉపాధ్యాయులకు పదోన్నతులు ద్వారా ఇవ్వవలసి ఉన్నదని తద్వారా ఏర్పడే ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరారు. కేవలం నామమాత్రంగా 2009, 2012 లో ప్రభుత్వ,పంచాయతీరాజ్ కేటగిరీల వారీగా పదోన్నతుల
అవకాశం కల్పించారని అన్నారు. ముఖ్యంగా పాఠశాలలో పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ,డిప్యూటీ డీఈవో లతోపాటు జూనియర్ డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు, గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క మండలాల్లో పూర్తిస్థాయి ఎంఈఓ పోస్టులు లేవని, అంతా ఇన్చార్జిలతో కొనసాగిస్తున్నారని చెప్పారు. జూనియర్ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులు పెద్ద మొత్తంలో ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతులు కల్పించక పోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు బలోపేతం కావాలంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తో పాటు ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘం నాయకులు మక్లా నాయక్, దాశివనాయక్, బాలు నాయక్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు
Attachments area