ఉపేక్షిస్తే ఉన్మాదం మనదాకా వస్తుంది.. ఐక్యంగా తరిమికొడదాం..
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క.
మణిపూర్ అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రదర్శన.-సదస్సు
రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 25. (జనంసాక్షి). మణిపూర్ మంటలకు కారణమైన మతోన్మాదం ఉపేక్షిస్తే మనదాకా వస్తుందని ఐక్యంగా తరిమికొట్టాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క అన్నారు. శుక్రవారం మణిపూర్ మహిళల పై అకృత్యులకు వ్యతిరేకంగా మణిపూర్ కుకి మహిళలపై అకృత్యాల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జే వి చలపతిరావు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ప్రజా ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం గాజుల మల్లయ్య కళ్యాణ మండపంలో గోట్టే రుక్మిణి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క మాట్లాడుతూ మణిపూర్ విధ్వంసం కుట్రపూరితంగానే జరిగిందని ఆరోపించారు. కలిసిమెలిసి ఉన్న ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టి హింసకాండ కు కారణమైన పాలకులపై ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో కేసులు పేరుకుపోయిన ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం వెనుక మతోన్మాదుల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. మణిపూర్ నాగాలాండ్ తో మొదలై దేశ మొత్తం మీద విద్వేషాలను రెచ్చగొడుతున్న బిజెపి అకృత్యాలను అడ్డుకొని పక్షంలో మనదాకా వచ్చే ప్రమాదం ఉందని సదస్సు నుంచి ఐక్యంగా తిప్పికొట్టి చైతన్యతో పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు జె.వి. చలపతిరావు మాట్లాడుతూ ఉన్మాదంతో అధికారంలోకి రావాలని కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గుజరాత్ లో ఏం జరిగిందో ఆలోచిస్తే దేశ మొత్తం మీద ఇలాంటి ఫార్ములానే ప్రయోగిస్తున్నారని ఇది దేశానికి ప్రమాదకరమని తెలిపారు. ప్రొఫెసర్ లక్ష్మి మాట్లాడుతూ మణిపూర్ ఘటన వెనుక మూలాలను అర్థం చేసుకోవాలని అన్నారు. మణిపూర్ లో జరిగిన కృత్యాలపై సదస్సు పలు తీర్మానాలు చేసింది.అరుణోదయ కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు సబికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాగుల రాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, బోజ్జ కనకయ్య, చేన్నమనేని పురుషోత్తం రావు, గుండా థామస్, దోసల చంద్రం, కంచర్ల రవి గౌడ్, మార్వాడి గంగరాజు, సాయికుమార్, లుక్క సౌమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.