ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు విధులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో జనం సాక్షి. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ లో పి. ఓ., ఏ.పి. ఓ.లు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నిబంధనల మేరకు విదులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయాదిత్య భవన్ లో మును గోడ్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక నిర్వహణకు నియమించిన పి. ఓ., ఏ.పి. ఓ.లకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 3 న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నవంబర్ 2 న న డి.అర్.సి.కేంద్రాలలో ఉదయం రిపోర్ట్ చేసి పోలింగ్ మెటీరియల్ తీసుకు వెళ్లాలని తెలిపారు. ఓటర్ జాబితా మార్క్డ్ కాపీ,పేపర్ సీల్స్,ఇతర పోలింగ్ సామగ్రి పరిశీలించాలని అన్నారు.పోలింగ్ కేంద్రం చేరుకున్న తర్వాత పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు,సిబ్బంది విధులు కేటాయింపు,100 మీ.లు,200 ఏరియా పోలింగ్ స్టేషన్ లలో మార్కింగ్ చేయాలని అన్నారు.100 మీ. ల పరిధిలో ప్రచారం, ఫోన్ లు,కెమెరా లు,వాహనాలు అనుమతించడం జరగదని అన్నారు.పోలింగ్ సామాగ్రి తమ కస్టడీ లో ఉంచుకొని రాత్రి బస చేయాలని అన్నారు.పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు వుంటుందని అన్నారు.పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు నియామకం,గుర్తింపు కార్డు లు జారీ చేయాలని అన్నారు.ఈ. వి.యం.ల వినియోగం లో అవగాహన కలిగి ఉండాలని,సకాలం లో పోలింగ్ ప్రారంభం కావాలని అన్నారు..ఈ సమావేశంలో మాస్టర్ ట్రైనర్ లు పరమెష్,బాలు లు శిక్షణా నిస్తు సందేహాలు నీ నివృత్తి చేశారు.ఈ సమావేశంలో జడ్.పి.సి.ఈ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణా నోడల్ అధికారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.