ఉభయ సభలు 29 కి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం వాయిదా పడ్డ అనంతరం సభలు సమావేశం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. సభాకార్యక్రమాలు సజావుగా జరుగకుండా అడ్డుకోవడంతో ఉభయ సభల సభాపతులు సభలను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో కూడా సభ్యులు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై చర్చకు పట్టుపట్టారు. ఉభయ సభల్లో సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయి ఆందోళనకు దిగారు.