ఉరికంబం ఎక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్న

– నా మరణాంతరం నేను లేనని బాధపడొద్దు
– ఈ ఉన్నతిని గుర్త్తుంచుకొని గర్వించండి
– కుటుంబ సభ్యులకు అఫ్జల్‌గురు చివరి ఉత్తరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) :
‘అల్లాను నమ్మే మనం ఎల్లప్పుడు నిజం పక్షానే నిలబడుదాం. నాకు ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన దేవుడికి వేనవేల కృతజ్ఞతలు.’ అని అఫ్జల్‌గురు తన భార్య తబుస్సమ్‌కు రాసిన చివరి ఉత్తరంలో పేర్కొన్నాడు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొంటూ ఈనెల 9న ఉదయం అఫ్జల్‌గురును ఉరితీసిన విషయం తెలిసిందే.
శిక్ష అమలు సమాచారం ముందుగానే అం దుకున్న గురు తన సతీమణికి చివరిసారిగా ఉత్తరం రాశాడు. లక్షల మందిలో అల్లా నాకు ఈ అవకాశాన్ని కల్పించిందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినని పేర్కొన్నారు. మీరు దిగులు చెందవద్దు, నా ఉన్నతి గుర్తుంచుకొని గర్విం చండని సూచించారు.
ఆయన కుటుంబ సభ్యులకు చివరిసారిగా రాసిన ఉత్తరం ఆదివారం వెలుగులోకి వచ్చింది. కాగా ఆయనను ఉరితీస్తున్నట్లు తీహార్‌ జైలు అధికారులు ఈనెల ఆరో తేదీన పంపిన స్పీడ్‌పోస్ట్‌ కంటే ముందే అఫ్జల్‌గురు కుటుంబ సభ్యులకు రాసిన ఉత్తరం గమ్య స్థానం చేరుకుంది.