ఉరి అమలులో చట్టబద్ధంగా

వ్యవహరించాం : షిండే
పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. జనవరి 21న రాష్ట్రపతికి అప్జల్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు పేర్కొన్నారు. దాన్ని రాష్ట్రపతి తిరస్కరిస్తూ ఫిబ్రవరి 3న ¬ంశాఖకు పంపినట్లు తెలిపారు. అప్జల్‌గురు దస్త్రంపై ఫిబ్రవరి 4న తాను సంతకం చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసినట్లు వెల్లడించారు. చట్టపరమైన నియమాలు పాటించే అప్జల్‌ను ఉరితీసినట్లు చెప్పారు. ఉరిశిక్ష అమలుపై అతని కుటుంబసభ్యులకు సమాచారమందించామన్నారు. మరోవైపు భారత పార్లమెంట్‌పై దాడి కేసులో అప్జల్‌గురుకు ఈ ఉదయం ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ ప్రకటన విడుదల చేసింది. తీహార్‌ జైల్లో ఉదయం 8 గంటలకు ఉరి తీసినట్లు ¬ంశాఖ అధికారులు తెలిపారు. అప్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.